జాతీయ లోక్ అదాలత్‌లో 3,500 కేసుల పరిష్కారం
జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని కోర్టుల్లో మొత్తం కేసులు 3,500 పరిష్కరించామని మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎ. వీరయ్య వెల్లడించారు. లోక్ అదాలత్ సందర్భంగా మొత్తం తొమ్మది బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ లోక్ అదాలత్ తో కక్షిదారులు సమయం వృథా కాకుండా అప్పిల్ లేకుండా ఉంటుందన్నారు. అంతేకాకుండా, ఇరు వర్గాలు గెలిచినట్టుగా అంతిమ తీర్పు ఉంటుందని ఆయన వెల్లడించారు.
పరిష్కరించిన కేసుల్లో 32 సివిల్ దావాలు, క్రిమినల్ కేసులు 3300 పైగా ఉన్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి జిల్లా న్యాయ సేవా సంస్థ జి.కవిత, ఏ నిర్మల, సీనియర్ సివిల్ జడ్జ్ దామోదర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్య, లైజన్ అధికారి సీహెచ్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.