నేడు రిమ్స్ కు విచారణ బృందం
ఆదిలాబాద్ రిమ్స్ (RIMS) ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ (SNCU) వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి విచారణ బృందం నేడు ఆసుపత్రిని సందర్శించనుంది. ఎస్ ఎన్ సీయూ వార్డులో జరిగిన ప్రమాదంపై ఆరుగురు ఉన్నతస్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ చేసింది ప్రభుత్వం…ఉట్నూర్ ఐటిడిఎ పీవో మంద మకరందు సారధ్యంలో ఈ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ కమిటీ ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తుంది. ఏసీ పేలడానికి ఉన్న సాంకేతిక లోపాలు, షార్ట్ సర్క్యూట్ తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీస్తుంది. ఆసుపత్రిలో ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, సివిల్ స్ట్రక్చరల్ ఆడిట్ నిర్వహించి నివేదిక సిద్ధం చేయడంతో పాటు ఆసుపత్రి నిర్వహణలో ఏవైనా లోపాలు, అధికారుల నిర్లక్ష్యం ఉంటే వాటిని గుర్తించి ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందచేస్తారు.
ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య 5కు చేరింది. ఎయిర్ కండిషనర్ (AC) పేలడం వల్ల దట్టమైన పొగలు అలుముకుని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి చిన్నారులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తేలింది. ప్రమాదం జరిగిన ఆరోజు వార్డులో 27 మంది నవజాత శిశువులు ఉన్నారు. అదే రోజు వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, మెరుగైన చికిత్స కోసం ఏడుగురు చిన్నారులను నిన్న రాత్రి అధికారులు హైదరాబాద్ తరలించారు.