ఆఫీసుల్లో ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

ప్రభుత్వ కార్యాలయాలలో విధుల పట్ల సమయపాలన పాటించని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లోని పౌరసరఫరాల శాఖ, పౌర సరఫరాల జిల్లా మేనేజర్, విద్య, రహదారులు భవనాలు, ఖజానా, గిరిజన సంక్షేమ, పరిశ్రమలు, పర్యాటక, ఆడిట్, వైద్య ఆరోగ్య శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా కొన్ని కార్యాలయాలలో అనుమతి లేకుండా గైర్హాజరు, కొన్ని కార్యాలయాలలో సమయపాలన పాటించని వైనాన్ని గుర్తించి సీరియ‌స్ అయ్యారు. సంబంధిత శాఖల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల ఖచ్చితంగా సమయపాలన పాటించాల‌న్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలని తెలిపారు.

You might also like