గర్భిణీ, శిశువు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన..

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రతిభా నర్సింగ్ హోమ్‌లో గర్భిణీ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. గర్భంలో శిశువు మృతి చెందిన విషయం తెలిసినప్పటికీ సకాలంలో అత్యవసర చికిత్స అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మృతి చెందిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

You might also like