తగ్గిన బంగారం, వెండి ధరలు..

కొన్ని రోజులుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి.కేవలం 4 గంటల్లోనే తులం బంగారం రూ.3.380 వరకు తగ్గింది. దీపావళి పండగకు ముందు త‌గ్గుగున్న ధరలు భారీగా కొనుగోలు దారులకు మంచి శుభ పరిణామమే అని చెబుతున్నారు. శుక్రవారంతో పోల్చుకుంటే ఈ రోజు ఏకంగా తులం బంగారం రూ.రూ.3.380 వరకు తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1,38,880 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధర రూ.10 వేల వరకు తగ్గి ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,00,000 వద్ద ట్రేడవుతోంది.

ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,38,880గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,300 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,00,000 వద్ద ట్రేడవుతుంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.రూ.1,38,880గా ఉండగా.. వెండి ధర రూ.2,00,000 వద్ద కోనసాగుతుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,39,030గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,450 వద్ద ట్రేడువుతుంది. ఇక వెండి కిలో ధర రూ.2,00,000గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,38,880గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,300గా ఉంది. వెండి కిలో ధర రూ.2,00,000 ఉంది.

ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై పెరిగిన అంచనాలే అని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు టెక్నాలజీ షేర్ల పతనం, అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ అమ్మకాలు కూడా ఇందుకు కారణమని అంటున్నారు. ముఖ్యంగా వెండి ధర బంగారం కంటే ఎక్కువగా పడిపోవడం గమనార్హం.

You might also like