పంట వేయొద్ద‌న్న ముఖ్యమంత్రి.. ప‌ద‌విలో ఎందుకుండాలే..?

చరిత్రలో మొట్టమొదటిసారి రైతులను పంటలు వేయవద్దని చెప్పిన అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కవిత మండిపడ్డారు. ఇంద్రవెల్లిలో తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభ నిర్వహించింది అందులో ఆమె మాట్లాడుతూ. రైతులను, ఆదివాసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కవిత ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, కేవలం రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. “చరిత్రలో రైతులను పంట వేయవద్దని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. వ్యవసాయం తప్ప వేరే పని తెలియని రైతులకు ఏ విధంగా ఆదుకుంటారో చెప్పకుండా పంట వద్దంటే ఆయన పదవిలో ఎందుకు ఉండాలి?” అని ప్రశ్నించారు. రెండు నెలలకు ఒకసారి ఆదిలాబాద్‌కు వస్తానని చెప్పిన సీఎం, మూడేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చారని, ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కట్టి 148 మీటర్లలో నీళ్లు నిల్వ చేయకుండా, కరువు వచ్చిన తర్వాత బాయి తవ్వినట్లు ఇప్పుడు మహారాష్ట్రతో మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

“రైతులను పంటలు వేయవద్దని చెప్పిన ముఖ్యమంత్రి అసలు ఆ పదవిలో ఎందుకు కొనసాగాలి?. చరిత్రలో మొట్టమొదటి సారి పంటలు వేయొద్దు అని చెప్పిన అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి. పంటలు వేయకుండా రైతులు ఎట్లా బతకాలి?” అని ఆమె ప్రశ్నించారు. పంటలు వేయకుండా రైతులు ఎలా బతకాలని, అలాంటి వ్యక్తికి సీఎం సీట్లో కూర్చునే హక్కు లేదని విమర్శించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలకు అధికారంలోకి రాగానే రూ.25 లక్షలు ఇస్తామని చెప్పి, కేవలం రూ.5 లక్షలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు.

You might also like