“ఖర్చే 1300 కోట్లు.. 1700 కోట్ల అవినీతి ఎలా?”
కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి జోగురామన్న ఫైర్
టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల అబద్ధాలు మాట్లాడిందని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ఆయన ఆదిలాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంద్రవెల్లి సంకల్ప సభలో టీఅర్ఎస్ అధ్యక్షురాలు కవిత చనాక కొరాట బ్యారేబీ విషయంలో చెప్పివన్నీ అబద్దాలని స్పష్టం చేశారు. బ్యారేజీలో అవినీతి జరిగిందని ఆరోపించారని అది నిజం కాదన్నారు. చనాక కోరాట బ్యారేజి కోసం మొత్తం ఖర్చే దాదాపు పదమూడు వందల కోట్లైతే… పదిహేడు వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం ఏంటని ఆయన ప్రశ్నించారు..? జీవోలు చూసుకోవాలని… తెలుసుకోవాలని మాట్లాడాలని జోగు రామన్న హితవు పలికారు.
ప్రజల ఐదు దశాబ్దాల కోరికైన చనాక కోరాట బ్యారేజీ పనులు కేసీఅర్ చేపట్టారని, బ్యారేజీ నిర్మాణ వ్యయం పెరిగింది కేవలం రూ. 308 కోట్లు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టు సబ్ స్టేషన్ కు డెబ్బై కోట్లు, ఇరవై మూడు గేట్ల నుండి మరో మూడు గేట్ల పెంచడానికి నిర్మాణం కోసం వంద కోట్ల వ్యయం పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. సీసీఐ పునఃప్రారంభం కోసం అప్పటి కేంద్ర మంత్రులను కలిశామని, దానిని పున ప్రారంభించడంలో కేంద్రప్రభుత్వం విపలమైందన్నారు. కవిత బీజేపీపై మాట్లాడకుండా మాపై విమర్శలు చేయడం తగదన్నారు. కవిత…సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడటం లేదని రామన్న వెల్లడించారు.