పేకాట రాయుళ్లు అరెస్ట్…
లాడ్జీలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐ.బీ కాలనీలో ఉన్న వినాయక్ రెసిడెన్సీ లాడ్జిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు మంగళవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ గోదావరిఖని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దీకొండ రమేష్, సిబ్బందితో కలిసి సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.1,36,130 నగదు,10 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిలో ఎస్.ఎం.ఖాన్, టి. నర్సింగరావు, పి.తిరుపతి, ఎం.కుమార్, కె.కిరణ్, వి.సతీష్, ప్రవీణ్, ఆర్.మణి, ఎస్.కె.భాషి, కె. రాజ్‌కుమార్ ఉన్నారు. పట్టుబడిన 10 మంది వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదు,సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అక్రమంగా పేకాట, జూదం నిర్వహించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.