అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. బాండ్ల వెరిఫికేషన్‌కు షెడ్యూల్ విడుదల!
అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసి ఏళ్లుగా తమ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు కీలక సమాచారం. ఆగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం, సీఐడీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపడుతున్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించిన వివరాల ప్రకారం.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ప్రాంత బాధితుల కోసం నస్పూర్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంచిర్యాలతో పాటు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన బాధితులు ఇక్కడ తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
అయితే బాధితులు నేరుగా కేంద్రానికి వెళ్లే ముందు తమ మండలానికి కేటాయించిన తేదీని తప్పనిసరిగా గమనించాలి. మంచిర్యాల జిల్లా పరిధిలోని బాధితుల కోసం జనవరి 28, 2027 నుంచి మార్చి 1, 2027 వరకు మండలాల వారీగా షెడ్యూల్ ప్రకటించారు.
డిపాజిటర్ జీవించి ఉంటే అసలు ఆగ్రిగోల్డ్ బాండ్ లేదా నగదు రసీదు, బాండ్‌పై సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకురావాలి. డిపాజిటర్ మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతాకు లింక్ అయిన ఫోన్ నంబర్ కూడా అందించాలి.
డిపాజిటర్ మరణించి ఉంటే నామినీ లేదా చట్టబద్ధ వారసులు మరణ ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలతో పాటు అవసరమైన ఇతర పత్రాలను సమర్పించాలి.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అసలు బాండ్‌ను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదు. ధృవీకరణ కోసం మాత్రమే చూపించాలి. బాండ్ కలర్ జిరాక్స్ ప్రతిపై సంబంధిత వ్యక్తి సంతకం చేసి సమర్పించాలి. పత్రాలు అందించిన వారికి రసీదు కూడా జారీ చేస్తారు.
ఈ ప్రక్రియ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
మంచిర్యాల కేంద్రానికి సంబంధించిన వివరాల కోసం వై. కృష్ణారెడ్డి, ఐఓపీ, సీసీఎస్‌ను 8179163403 నంబర్లో సంప్రదించవచ్చు.
ఆగ్రిగోల్డ్ బాధితులు, డిపాజిటర్లు, నామినీలు, చట్టబద్ధ వారసులు, ఏజెంట్లు తమకు కేటాయించిన తేదీల్లో అవసరమైన పత్రాలతో నస్పూర్ పోలీస్ స్టేషన్‌లోని ధృవీకరణ కేంద్రానికి హాజరుకావాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ సూచించింది.
మంచిర్యాల జిల్లా మండలాల వారీ షెడ్యూల్
|
తేదీ |
మండలం / బాధితుల సంఖ్య |
|---|---|
|
జనవరి 28 |
బెల్లంపల్లి – 250 |
|
జనవరి 29 |
బెల్లంపల్లి – 197, భీమారం – 53 |
|
జనవరి 30 |
భీమారం – 199, భీమిని – 51 |
|
ఫిబ్రవరి 1 |
భీమిని – 250 |
|
ఫిబ్రవరి 2 |
భీమిని – 33, చెన్నూరు – 217 |
|
ఫిబ్రవరి 3 |
చెన్నూరు – 154, దండేపల్లి – 96 |
|
ఫిబ్రవరి 4 |
దండేపల్లి – 250 |
|
ఫిబ్రవరి 5 |
దండేపల్లి – 36, హాజీపూర్ – 214 |
|
ఫిబ్రవరి 6 |
హాజీపూర్ – 33, జైపూర్ – 217 |
|
ఫిబ్రవరి 8 |
జైపూర్ – 208, జన్నారం – 42 |
|
ఫిబ్రవరి 9 |
జన్నారం – 250 |
|
ఫిబ్రవరి 10 |
జన్నారం – 66, కన్నెపల్లి – 184 |
|
ఫిబ్రవరి 11 |
కన్నెపల్లి – 202, కాసిపేట – 48 |
|
ఫిబ్రవరి 12 |
కాసిపేట – 250 |
|
ఫిబ్రవరి 15 |
కాసిపేట – 41, కోటపల్లి – 209 |
|
ఫిబ్రవరి 16 |
కోటపల్లి – 46, లక్షెట్టిపేట – 204 |
|
ఫిబ్రవరి 17 |
లక్షెట్టిపేట – 104, మంచిర్యాల – 146 |
|
ఫిబ్రవరి 18 |
మంచిర్యాల – 204, మందమర్రి – 46 |
|
ఫిబ్రవరి 19, 20, 22 |
మందమర్రి – రోజుకు 250 |
|
ఫిబ్రవరి 23 |
మందమర్రి – 7, నస్పూర్ – 243 |
|
ఫిబ్రవరి 24 |
నస్పూర్ – 154, నెన్నెల – 96 |
|
ఫిబ్రవరి 25 |
నెన్నెల – 157, తాండూర్ – 93 |
|
ఫిబ్రవరి 26 |
తాండూర్ – 196, వేమనపల్లి – 54 |
|
ఫిబ్రవరి 27 |
వేమనపల్లి – 223, ఖానాపూర్ – 27 |
|
మార్చి 1 |
ఖానాపూర్ – 222, లోకేశ్వరం – 28 |