స‌మ‌స్య‌లు విని… ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించి…

ప్ర‌జా స‌మ‌స్య‌లు నేరుగా విన్న ఎస్పీ వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, చట్టప్రకారం చర్యలు తీసుకొని సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.

కుటుంబ సమస్యలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలతో మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించారు. సమస్యలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకునేలా సూచనలు చేశారు. భైంసాలోనే కౌన్సిలింగ్ సదుపాయం కల్పించడంతో బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలలో వచ్చిన ఫిర్యాదుల్లో ఇంకా పరిష్కారం కానివాటిపై ఎస్పీ సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు గ్రీవెన్స్ డే మంచి అవకాశమని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు.

You might also like