ఆకలిపై అక్షర విజయం..
4 లక్షల మందికి సింగరేణి 'అన్నపూర్ణ'!
“తెల్లవారుజామునే నిద్రలేచి, కడుపులో ఆకలిని దిగమింగుకుంటూ బడిబాట పట్టే పేద విద్యార్థుల కష్టాలకు తెరపడింది. బడి గంట మోగే వేళ పిల్లల మనసు పుస్తకాలపై నిలవాలంటే.. ముందుగా వారి కడుపు నిండాలి. ఇదే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బ్రేక్ఫాస్ట్ పథకానికి’ సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యతతో పెద్దన్నలా అండగా నిలిచింది. రూ.61.44 కోట్ల భారీ నిధులతో 9 అత్యాధునిక సెంట్రలైజ్డ్ వంటశాలలను నిర్మిస్తూ.. ఏకంగా 4 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆకలి తీరుస్తోంది. దేశానికి విద్యుత్ వెలుగులు పంచే సింగరేణి.. భావితరాల భవిష్యత్తుకు ఎలా బంగారు బాటలు వేస్తుందో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం…”
“దేశానికి వెలుగులు పంచే సింగరేణి సంస్థ.. ఇప్పుడు భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బ్రేక్ఫాస్ట్ పథకానికి’ తన సామాజిక బాధ్యత (CSR) కింద రూ.61.44 కోట్ల భారీ నిధులతో అండగా నిలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 కేంద్రీకృత వంటశాలల ఏర్పాటుతో 4 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆకలి తీరుస్తోంది.”
“బడి గంట మోగే వేళ పిల్లల మనసు చదువుపై నిలవాలంటే, ముందుగా వారి కడుపు నిండాలి. ఇదే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశానిర్దేశంలో తెలంగాణ బ్రేక్ఫాస్ట్ పథకం విజయవంతంగా అమలవుతోంది. హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వహణలో సింగరేణి సంస్థ రూ.61.44 కోట్ల సీఎస్ఆర్ నిధులతో మొత్తం 9 చోట్ల అత్యాధునిక సెంట్రలైజ్డ్ వంటశాలలను ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా సుమారు 8 వేల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని 4 లక్షలకు పైగా విద్యార్థులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన అల్పాహారం అందనుంది.
ఇప్పటికే తొలిదశలో రూ.2 కోట్లతో కొడంగల్లో, ఆ తర్వాత రూ.21.03 కోట్లతో మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లో ఈ వంటశాలలు ప్రారంభమై సేవలు అందిస్తున్నాయి. త్వరలోనే రూ.38.41 కోట్ల వ్యయంతో కొత్తగూడెం, సూర్యాపేట (మునగాల), సింగరేణి (ఖమ్మం), కాగజ్నగర్, భూపాలపల్లి ప్రాంతాల్లో మరో 5 కిచెన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
గ్రామీణ పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా బడి మానేసే వారి సంఖ్య తగ్గి, హాజరు శాతం పెరుగుతోందని విద్యావేత్తలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు సామాజిక సేవలోనూ సింగరేణి ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసలు కురుస్తున్నాయి.