అల్లం నారాయణను పరామర్శించిన కవిత
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అల్లం నారాయణ సతీమణి పద్మ మరణించిన నేపథ్యంలో అల్లం నారాయణ ఇంటికి వెళ్ళి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జె ఏ సి లో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో మూడు రోజుల కిందట కన్నుమూశారు. ఆమె 24 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో జీవన్మరణ పోరాటం చేశారు. అప్పట్లో ఉద్యమంలో, తర్వాత అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ అకాలమరణం చెందారు.