ఇంద్రకరణ్‌రెడ్డి కబ్జాకోరు
కాంగ్రెస్ నేత మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం
నిర్మల్ : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పెద్ద కబ్జాకోరని కాంగ్రెస్ నేత మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కబ్జాలు,అక్రమాల చిట్టా బయటపెడుతాన్నారు. నీ అక్రమాల చిట్టా విప్పేందుకు నేను సిద్దం, నిరూపించకపోతే నేను రాజీనామా చేస్తాన్నన్నారు. లేకపోతే ఇంద్రకరణ్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి పోటీకిరా అని సవాల్ విసిరారు.
పదే పదే రెండు సార్లు ఓడిపోయావంటూ నన్ను అనడం కాదు. నువ్వు మూడు సార్లు ఓడిపోయిన సంగతి మర్చిపోయావా….? అని ప్రశ్నించారు. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నావంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హమీలు నెరవేర్చని మంత్రి గ్రామాలకు ఒంటరిగా వెళ్లే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. జనం నిలదీస్తారని పోలీసు బలగాలతో గ్రామాలకు వెళ్తున్నావని దుయ్యబట్టారు. పోలీసులు లేకుండా నువ్వు ఒక్క గ్రామానికైనా వెళ్తావా..? అని ప్రశ్నించారు. నా జీవితం తెరిచిన పుస్తకం అనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీ పుస్తకంలోకబ్జాలు, అవినీతి, అసైన్డ్ భూములు, బోగస్ కంపెనీలతో చేసే అక్రమాలన్నీ ఉన్నాయన్నారు. కాంగ్రెస్ మెంబర్ షిప్ డ్రైవ్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదన్నారు. మీలాగా ఇండ్లలో కూర్చోని మెంబర్ షిప్ చేయడం లేదని మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.