అంబరాన్నంటిన సంబరాలు.

చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప‌థ‌కానికి బ‌డ్జెట్లో టెండ‌ర్లు పిలుస్తామ‌ని ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. చెన్నూరు నియోజకవర్గం లోని గ్రామ, మండల, మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెల‌కొంది. టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, కోటపల్లి, జైపూర్, మందమర్రి, మండలాలు క్యాతనపల్లి,మందమర్రి,చెన్నూర్ మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఇప్పుడు చెన్నూరు ఎత్తిపోతల పథకం ద్వారా తమ బీళ్లకు నిరంతరాయంగా సాగునీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం వెంట ఉంటామ‌ని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తామని నియోజకవర్గ రైతులు ముక్తకంఠంతో తెలిపారు.

You might also like