నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం
మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్
నిరుద్యోగ యువతకు అన్ని రకాలుగా అండగా ఉంటామని మంచిర్యాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ స్పష్టం చేశారు. తాండూర్ మండలంలోని బోయపల్లిలో నిరుద్యోగ యువకులు ఏర్పాటు చేసుకున్న సొంత లైబ్రరీని సందర్శించారు. బోయపల్లి గ్రామానికి చెందిన యువత అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఈ గ్రంథాలయానికి,నిరుద్యోగ యువతకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా గ్రామ యువకులు పుస్తకాలు, ఫ్యాన్లు కావాలని కోరడంతో స్పందించిన సర్పంచ్ సునీత 10,000రూపాయల చెక్ మాజీ సర్పంచ్ మిట్ట వేణు 2,000 నగదు రేణికుంట్ల ప్రవీణ్ చేతుల మీదుగా అందించారు. మరికొన్ని ఫ్యాన్లను మాజీ ఎంపిపి శ్రీదేవి అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బీమా సునీత, మాజీ ఎంపీపీ మసాడి శ్రీదేవి,మాజీ సర్పంచ్ వేణు, మాసాడి తిరుపతి పాల్గొన్నారు.