కార్మికుల సిఎంపీఎఫ్ డబ్బులు తిరిగి చెల్లించాలి
-సిఎంపీఎఫ్ కుంభకోణం సిబిఐ విచారణ చేయాలి
-భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య
మంచిర్యాల : డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ బాకీ ఉన్న దానిని సీఎంపీఎఫ్ ట్రస్టు మాఫీ చేయడం చట్టవిరుద్ధమని, కార్మికుల సీఎంపీఎఫ్ డబ్బులు తిరిగి చెల్లించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. ఆయన బిఎంఎస్ భూపాలపల్లి ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశంలో అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎంపీఎఫ్ ట్రస్టు డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1300 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారని తెలిపారు. DHFL కంపెనీ దివాలా తీయడంతో ఆ కంపెనీ బాకీ ఉన్న 727 కోట్ల 56 లక్షల రూపాయలను CMPF ట్రస్టు బోర్డు మాఫీ చేయడం దారుణమన్నారు. కార్మికులు,పెన్షనర్ల సొమ్ము ఈ రకంగా మాఫీ చేయడం చట్ట విరుద్ధమన్నారు. దీని పై సీబీఐ విచారణ జరిపించి ఆ కంపెనీ బాకీ ఉన్న మొత్తం డబ్బుని వావస్ తీసుకోవాలన్నారు. వారి ఆస్తులు అమ్మి అయినా ఈ డబ్బు కట్టించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సీఎంపీఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఎంఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 24న అన్ని సీఎంపీఎఫ్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామన్నారు.
మహాసభలో నూతనంగా ఎన్నికైన వారిని ఈ సందర్భంగా సన్మానించారు. అధ్యక్షుడు యాదగిరిసత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేష్, కేంద్ర కార్యదర్శి ఎం.మనోన్ కుమార్ ని భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్,వీ.సుజేందర్,పాండ్రాలమల్లేష్,బోయినవెంకటస్వామి,గట్లమల్లారెడ్డి,ఓరంలక్ష్మణ్,పనిరమేష్,ఎండీయూసుఫ్,కడారిశంకర్,పనిరమేష్,ఈ.శ్రీనివాస్,అల్లం శ్రీనివాస్,భాస్కర్,సదానందం,బ్రహ్మచారి పాల్గొన్నారు.