ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత
ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా లో చోటు చేసుకుంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద జరిగింది. ముగ్గురు మిత్రులు మిడ్ మానేరులో ఈతకు వెళ్లారు. వారు ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతయిన ముగ్గురిలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరిని స్థానికులు కాపాడటంతో ప్రాణాలతో బయట పడ్డాడు. మృతులు ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన కుర్రు శ్రీనివాస్,తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పొన్నం రాజుగా గుర్తించారు. మృతుల బంధువుల రోదనలతో మధ్య మానేరు తీరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.