ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా బెల్లంప‌ల్లి

-ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల రూపురేఖ‌లు మార్చేందుకే మన ఊరు-మన బడి
-గ‌త పాల‌కులు విద్య గురించి క‌నీసం ప‌ట్టించుకోలే
-కేసీఆర్ చొర‌వ‌తో విద్యారంగంలో విప్ల‌వం తీసుకువ‌చ్చాం
-బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య

మంచిర్యాల:ముఖ్య‌మంత్రి కేసీఆర్ చొర‌వ‌తో బెల్లంప‌ల్లి నియోజ‌కవ‌ర్గాన్ని ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా తీర్చిదిద్దామ‌ని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గంచిన్న‌య్య స్ప‌ష్టం చేశారు. గురువారం మన ఊరు-మన బడి కార్య‌క్ర‌మంలో భాగంగా పాఠ‌శాల‌ల్లో ప‌నుల‌కు కొబ్బ‌రికాయ కొట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలల ఆధునీకరణకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.

ప్రజలు, పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేసి పాఠశాలలను మరింత అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. గ‌త పాల‌కులు విద్య గురించి క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు విద్యారంగంలో విప్ల‌వం తీసుకువ‌చ్చామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డి విద్యార్థులు గ‌తంలో హైద‌రాబాద్‌, ఆంధ్రా ప్రాంతానికి వెళ్లి చ‌దువ‌కునే వార‌ని ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. స‌క‌ల సౌక‌ర్యాల‌తో పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు ఏర్పాటు చేశామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న కన్నెపల్లి మండలం రెబ్బెన (SC కాలనీ)లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 23లక్షలతో,జజ్జరవెళ్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.31 లక్షలతో వంట గది,విద్యుదీకరణ, పెయింటింగ్, మరమ్మత్తులు, ప్రహారీ గోడను నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సత్యనారాయణ,సర్పంచ్ సునీత,ఎంపీటీసీ కర్రే లతశ్రీ,కన్నెపల్లి, భీమిని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సాయిని రంగారావు, నిరంజన్, నియోజికవర్గ యువజన అద్యక్షుడు జిల్లెల మహేష్, MEO మహేశ్వర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన‌నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like