ఫ్లాష్.. ఫ్లాష్.. కత్తిపోట్ల కలకలం
నిర్మల్ జిల్లా కేంద్రంలో కత్తి పోట్ల కలకలం రేపింది. డాక్టర్స్ లెన్లోని ఓ ల్యాబ్ లో రాజు అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు.. గాయాలైన రాజును జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. రాజు వెనక భాగంలో కత్తి అలాగే ఉంది.. ఆసుపత్రి వైద్యులు దాన్ని తొలగించి చికిత్స అందిస్తున్నారు.. దాడి చేసంది ఎవరు…? ఎందుకు చేసారు..? అనే దాని పై పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు.