మమ్మల్ని విమర్శించే అర్హత మీకెక్కడిది..?
-హక్కులు తీసుకువచ్చింది మేము
-ఉన్న వాటిని పోగొట్టొంది మీరు
-టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల ఆగ్రహం
మంచిర్యాల : కార్మికులకు హక్కులను తీసుకొచ్చిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని విమర్శించే అర్హత జాతీయ కార్మిక సంఘాలకు లేదని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల స్పష్టం చేశారు. ఆర్జిటు ఉపాధ్యక్షుడు ఆయిలిశ్రీనివాస్ అధ్యక్షతన ఓసిపి త్రీ కృషిభవన్‌లో టీబీజీకేఎస్ జరిగిన గేట్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేజ్‌బోర్డు ద్వారా కార్మికులకు హక్కులు తీసుకురావాల్సిన జాతీయ కార్మిక సంఘాలు ఉన్న హక్కులను పోగొడుతున్నాయని దుయ్యబట్టారు. ఈ సంఘాలను కార్మికులను ఆర్థికంగా నష్టానికి గురి చేస్తున్నాయన్నారు. పెన్షన్ కు అదనపు రికవరీ ఒప్పుకోవడమే కాకుండా పెన్షన్ పెరుగుదలకు కనీస ప్రతిపాదన చేయకపోవడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
గతంలో జీతం లీవులు సంవత్సరానికి ఎన్నిసార్లయినా పెట్టుకునే అవకాశం ఉండగా జాతీయ కార్మిక సంఘాలు మూడు సార్లు మాత్రమే లీవ్ పెట్టుకోవచ్చని అగ్రిమెంట్ చేసుకోవడం, సిక్ లీవు, సి ఎల్ దిగిపోయే సంవత్సరంలో ఎన్ని నెలల సర్వీస్ ఉంటే అన్ని మాత్రమే పెట్టుకునే అవకాశాన్ని ఒప్పందం చేసుకోవడం కార్మిక వర్గాన్ని మోసం చేయడమేనన్నారు. సిపిఆర్ యంఎస్ ద్వారా రిటైర్ అయిన కార్మికులకు 8 లక్షల వరకే వైద్య ఖర్చులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవడం సిగ్గుచేటని అదే అధికారులు 25 లక్షల రూపాయల వరకు నయా పైసా చెల్లించకుండా ఒప్పందం చేసుకున్నారని ఇదేక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు.
గతంలో గుర్తింపు సంఘాలుగా సింగరేణిలో ప్రాతినిధ్యం వహించిన ఇవే జాతీయ కార్మిక సంఘాలు 60కి పైగా హక్కులు పోగొట్టాయని, కానీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రెండుసార్లు గుర్తింపు కార్మిక సంఘంగా 60కి పైగా హక్కులు తెచ్చామని స్పష్టం చేశారు. తాము తెచ్చిన హక్కుల్లో వైఫల్యాలను వెతికె చిల్లర సంఘాలుగా జాతీయ కార్మిక సంఘాల నాయకులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో మాదిరిగానే వచ్చే ఎన్నికలలో వారికి బుద్ది చెప్పేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని కెంగర్ల వెల్లడించారు. వివిధ యూనియన్లకు సంబంధించిన వందమంది కార్మికులకు మల్లయ్య కండువా కప్పి యూనియన్ లోకి ఆహ్వానిచ్చారు. ఈ సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున కెంగర్లమల్లయ్యని గజమాలతో సన్మానించారు.
కార్యక్రమంలో నాయకులు కొత్త సత్యనారాయణ రెడ్డి, దేవా వెంకటేశం ,శంకర్ నాయక్, ఎట్టం కృష్ణ, చెరుకు ప్రభాకర్ రెడ్డి, బాణాకర్, దశరథం ,బేతి చంద్రయ్య, పైడిపల్లి ప్రభాకర్,కర్క శ్రీనివాస్, బాలయ్య ,రవీందర్ రెడ్డి సూర్య శ్యామ్ సలిగంటి రాములు తోకల సమ్మయ్య భీముని సత్యనారాయణ రంగిశెట్టి వెంకన్న చేరాలు, ఆకుల రాజయ్య, భీముని సత్యనారాయణ, మామిడి తిరుపతి, నరసయ్య, సంజీవ్, రాజమౌళి పాల్గొన్నారు