స్పందించి.. స‌మ‌స్య ప‌రిష్క‌రించి…

నాయ‌కుడంటే స‌మ‌స్య చెబితే వెంట‌నే స్పందించేవాడు… నేత అంటే ప్ర‌జ‌ల వెంటే వారి క‌ష్ట‌సుఖాల్లో పాలు పంచుకునే వాడు. సిర్పూరు ఎమ్మెల్యే ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో ఉంటాడు. త‌మ‌కు ఇబ్బంది ఉంద‌ని ఆ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటారు. తాజాగా, ఓ చెరువు క‌ట్ట మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌కు సంబంధించి ఆయ‌న తీసుకున్న చొర‌వ‌తో రైతుల‌కు పెద్ద ఎత్తున న‌ష్టం త‌ప్ప‌డ‌మే కాకుండా, మ‌త్స్య‌కారుల‌కు కూడా మేలు జ‌రిగింది.

బెజ్జూర్ మండలంలోని గోళ్లబాయి చెరువు కట్ట గ‌త ఏడాది భారీగా కురిసిన వ‌ర్షాల‌తో పూర్తిగా దెబ్బ‌తింది. ఆ విష‌యంలో అధికారులు స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో ఈ ఏడాది చిన్న వ‌ర్షం ప‌డినా ఆ చెరువు క‌ట్ట తెగుతుంద‌ని రైతులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఒక‌వేళ అదే జ‌రిగితే.. ఐదు వేల ఎక‌రాల పంట న‌ష్టం జ‌రుగుతుంది.. బెజ్జూరు, నాగుల‌వాయి, రేచిని త‌దిత‌ర గ్రామాలు సైతం ముంపున‌కు గుర‌వుతాయి. ఇదంతా ఒక్కెత్తు కాగా, మ‌త్స్య‌కారులు అందులో వేసుకున్న ల‌క్ష‌లాది రూపాయ‌ల చేప‌ల విత్త‌నాలు నీటి పాల‌య్యేవి. దీంతో ఈ విష‌యాన్ని మత్స్యకారులు,రైతులు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప దృష్టికి తీసుకువెళ్లారు.

స‌మ‌స్య తెలుసుకున్న ఎమ్మెల్యే ప‌నులు వెంట‌నే పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మ‌రోవైపు జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ కోనేరు కృష్ణారావు,నాయ‌కులు క‌లిసి క‌ట్ట మ‌ర‌మ్మ‌తు ప‌నులు పూర్తి చేయించారు. స‌మ‌స్య గురించి చెప్ప‌గానే ద‌గ్గ‌రుండి దాని ప‌రిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే కోన‌ప్ప‌, జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ కృష్ణారావు, స్థానిక నేత‌ల‌కు రైతులు, మ‌త్స్య‌కారులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like