వికలాంగుల హక్కులను అమలు చేయాలి

ఆ సంఘం జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ

వికలాంగుల న్యాయమైన హక్కులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి ) పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ల‌క్ష్సెట్టిపేట‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన పెంచిన వికలాంగుల పెన్షన్స్ వెంటనే అందించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో వికలాంగుల జీవో ప్రకారం 5 శాతం రిజర్వేషన్స్ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బస్, ట్రైన్ పాస్ లను పునరుద్ధరించాలన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాన్ని తమ వికలాంగుల హక్కుల గురించి, వాటి అమలు గురించి ప్రశ్నించకపోవడం బాధాక‌ర‌మ‌న్నారు. కేవలం ఓట్ల సమయంలో మా వికలాంగులకు ప్రాధాన్యతనిచ్చి ఇప్పుడు విస్మరించడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు వికలాంగులను మోసం చేస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొత్త పెన్షన్లు అందించి త‌మ‌ను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగా పెంచిన పెన్షన్ల‌ను తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెరిగిన పెన్షన్స్ వికలాంగులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.

వికలాంగుల హక్కులు, న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం లక్షేట్టిపేట పట్టణ, మండల నూతన కమిటీలను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కులు పోరాట సమితి నాయకులు ముల్కల్ల శ్రీనివాస్, దేవి ప్రకాష్, కోడిజుట్టు రాజేశం, రఘుపతి, రాకేష్, రాజలింగు, రవీందర్, లచ్చన్న, రాజు, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like