కోడి పందాలు : మాజీ ఎమ్మెల్యే పరార్..
పఠాన్‌చెరువు మండలం చిన్న కంచర్లలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. మామిడితోటల్లో ఈ కోడిపందాలు జరుగుతున్నాయన్నా పక్కా సమాచారం మేరకు వారు స్థావరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కోడి పందాలు నిర్వహిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో ఈ పందేలు సాగుతున్నట్లు గుర్తించారు. ఆయన పరారీలో ఉన్నారు. ఇద్దరు నిర్వహకులతో సహా 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి 13 లక్షల 12 వేల 140 రూపాయల నగదు, 32 కోళ్లు, 26 వాహనాలను, 25 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70మంది కోడి పందేలలో పాల్గొన్నారని పటాన్చెరు డిఎస్పీ భీంరెడ్డి తెలిపారు. 60 మంది వరకు ఖరీదైన వాహనాలను వదిలి పారిపోయారని.. వారిని త్వరలో పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.