కేంద్రానివి ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు

బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ జ‌క్కుల శ్వేత

మంచిర్యాల : కేంద్రానివి ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ని బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ జ‌క్కుల శ్వేత అన్నారు. గురువారం కేంద్రం గ్యాస్ సిలిండ‌ర్ల‌పై పెంచిన ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలోని కాంటా చౌర‌స్తా వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కేవ‌లం గ్యాస్ ధ‌ర‌లే కాకుండా నిత్యావ‌స‌ర ధ‌ర‌లు సైతం ఇష్టారీతిన పెంచుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సామాన్యుడిపై భారం పెంచుతూ వారిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారని అన్నారు. మోదీ అధికారంలోకి రాక ముందు 400/- రూపాయలు ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధర నేడు రూ.1,105 చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్య‌క్ర‌మంలో వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు గోసిక రమేష్, గడ్డం అశోక్,Sk అప్సర్, కొమ్ముల సురేష్, గురుండ్ల లక్ష్మీ, షేక్ఆస్మా, కెమిశెట్టి సరిత,తుంగపల్లి సుజాత, తడక పద్మావతి, కో ఆప్షన్ సభ్యులు ఏలూరి వెంకటేష్, వాజిద్, TRSV జిల్లా అధ్యక్షులు బడికెల శ్రావణ్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు మురుకురి శ్రావణ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు దామెర కిరణ్, నెల్లి రమేష్,బడికెల రమేష్, చిట్టాల మధు, ఎలిగేటి శ్రీనివాస్, సముద్రాల మురళి, గురుండ్ల సత్యనారాయణ, పోలు శ్రీనివాస్, కుంభాల రాజేష్, అలీ, కలీమ్, పుల్లూరి మోహన్, సోతుకు శ్రీనివాస్, పైడిమల్ల చంద్రశేఖర్, మద్దెల గోపి, పట్నం చక్రధర్, సుంకిత సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like