రెబ్బన ఎస్ఐగా భూమేష్
ఆసిఫాబాద్ : రెబ్బన మండలం నూతన ఎస్ఐగా ఎల్.భూమేష్‌ను నియమిస్తూ రామగుండం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ భవానీ సేన్ ఓ యువతిని వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను రామగుండం కమిషనరేట్‌లో వెకెన్సీ రిజర్వ్‌కు పంపించారు. ప్రస్తుతం వెకెన్సీ రిజర్వ్‌లో ఉన్న భూమేష్‌ను రెబ్బన ఎస్ఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.