బుద్ధి లేదా? యూస్ లెస్ ఫెలో..
ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ నేత పై డీఈవో తిట్ల దండకం
DEO scolds private teachers forum leader: “బుద్ధి లేదా? యూస్ లెస్ ఫెలో.. స్కూల్స్ కి వెళ్లే టీచర్స్ కి బుద్ధి లేదా..?” ఇది ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ నేత పై డీఈవో వెంకటేశ్వర్లు తిట్ల వర్షం.. వివరాల్లోకి వెళితే..
దసరా పండగ సందర్భంగా ఈ నెల 26 నుండి వచ్చే నెల 09 తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించింది. విద్యాసంస్థలు మాత్రం పాఠశాలలు నడుపుతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు టీచర్లు పాఠశాలలకు హాజరవుతున్నారు.
ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ TPTF నాయకుడు ఒకరు మంచిర్యాల విద్యాధికారి వెంకటేశ్వర్లుకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫోన్ లోనే ఉపాధ్యాయులకు బుద్ధి లేదా? యూస్ లెస్ ఫెలో అని తిట్ల వర్షం కురిపించారు. డీఈవో యజమాన్యాలతో కుమ్మక్కై, వారిచ్చే ముడుపులు తీసుకుంటు వారికే మద్దతుగా మాట్లాడుతున్నారని, తిరిగి టీచర్స్ కి బుద్ధి లేదా అని దూర్భాషలాడడంపై ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ (గురుదక్షిణ) అధ్యక్షులు నారమల్ల విజయ్ కుమార్ మండిపడ్డారు. విద్యాధికారి వెంకటేశ్వర్లు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.