మంచిర్యాలలో భూ ప్రకంపనలు
మంచిర్యాల జిల్లాలో మళ్లీ భూకంపం సంభవించింది. జిల్లాలో పలు చోట్ల భూమి కంపించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. పలు చోట్ల మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించింది. సాయంత్రం 6.48 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు లక్ష్సెట్టిపేట, బెల్లంపల్లి, మాదారం టౌన్షిప్లలో భూమి స్వల్పంగా కంపించింది. కొమురంభీమ్ జిల్లాలోని బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల్లో సైతం భూ ప్రకంపనలు సంభవించాయి. గత శనివారం మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంపం సంభవించగా వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం.