మాజీ ఎంఎల్సీ పురాణం కి తప్పిన ప్రమాదం
Ex-MLC is a missed opportunity for legend: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంఎల్సీ పురాణం సతీష్ కి పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు ప్రమాదానికి గురికావడంతో ఆయన ఇన్నోవా వాహనం నుజ్జు నుజ్జు అయింది. అయితే ప్రమాదం నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
మాజీ ఎంఎల్సీ పురాణం సతీష్ తన స్వగ్రామం మంచిర్యాల జిల్లా కోటపల్లి నుండి హైదరాబాద్ బయలుదేరారు. సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి వద్ద ఎదురుగా వాహనం వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో పురాణం సతీష్ కుమార్ కు ప్రమాదం తప్పింది. కుమారుడు కౌశిక్ తో కలిసి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ఘటన సంభవించింది. వాహనంలో ఉన్న అందరూ సురక్షితంగా ఉన్నారు.