ఎక్సైజ్ అధికారులపై స్మగ్లర్ల దాడి
Smugglers attack Excise officials: ఎక్సైజ్ అధికారులపై మద్యం స్మగ్లర్ల దాడి ఘటన కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలం లింబూగూడలో ఎక్సైజ్ అధికారులపై దేశీదారు స్మగ్లర్లు దాడి చేసారు. బుధవారం రాత్రి దేశిదారు పట్టుకోవడానికి ముగ్గురు ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. వారిని గమనించిన స్మగ్లర్లు రాళ్లతో దాడి చేసారు. ఈ దాడిలో ఎస్సై సంజీవ్ తలకు తీవ్ర గాయాలు కాగా, కానిస్టేబుల్స్ కు స్వల్ప గాయాలయ్యాయి.