ఆ కుటుంబమే తెలంగాణకు వ్యతిరేకం
-పరాయి మనుషులు, కిరాయి వ్యక్తుల తోలుబొమ్మలాట
-ఇష్టం వచ్చినట్లు వాగితే సహించేది లేదు
-అది ఆడపిల్లలు మాట్లాడే భాష నేనా..?
-వైఎస్ షర్మిల పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం
Balka Suman angry with YS Sharmila: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మెుత్తం తెలంగాణకు వ్యతిరేకమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ దుయ్యబట్టారు. వైఎస్ జగన్ కూడా పార్లమెంట్లో తెలంగాణను వ్యతిరేకించారని తెలిపారు. వైఎస్ షర్మిల ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా ఉన్న షర్మిల తెలంగాణకు వచ్చి సుద్దులు చెబితే ఎవరైనా నమ్ముతారా ? అని అన్నారు. వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు భవిష్యత్తులో ఏం జరిగినా తాము బాధ్యులం కామని చెప్పారు. తెలంగాణ పోరాటం గురించి షర్మిలకు ఏం తెలుసో చెప్పాలన్నారు. వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు భవిష్యత్తులో ఏం జరిగినా తాము బాధ్యులం కామని చెప్పారు.
“పరాయి మనుషులు కిరాయి వ్యక్తులతో వచ్చి తోలుబొమ్మలాడితే ఎవరూ పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సహనానికి ఓపికకు హద్దు ఉంటది. రాబోయే రోజుల్లో ఏం జరిగినా మాకు సంబంధం లేదని బాల్క స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డమీదకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెవులు మూసుకుని కూర్చోవాలా ? అని ప్రశ్నించారు. అసలెవరీ షర్మిల. ఆమెకు తెలంగాణ గురించి ఏం తెలుసన్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చారు. హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాలని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ను షర్మిల అప్ఘనిస్థాన్‌తో పోల్చుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వందల ఎకరాలు కబ్జా పెట్టారని దుయ్యబట్టారు. తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని షర్మిల బయ్యారం గనులను దోచుకోవాలని ప్రయత్నించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని గురించి అసభ్యకరంగా మాట్లాడారు. మా ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. నా నియోజకవర్గంలో కూడా పాదయాత్ర సమయంలో ఇష్టారీతిలో మాట్లాడారు. ఆ సమయంలో మా పార్టీ శ్రేణులను నిలువరించానని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ను చీల్చేందుకు వైఎస్ఆర్ ప్రయత్నాలు చేశారని అన్నారు. అందుకే మహబూబాబాద్‌లో గతంలో నీ సోదరుడు జగన్ యాత్ర చేస్తామంటే తెలంగాణ ప్రజలు అడ్డుకున్నారని గుర్తు చేశారు. షర్మిల మాట్లాడే మాటలు ఆడపిల్లలు మాట్లడే భాషేనా? అని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై జరిగిన దాడి గురించి గవర్నర్‌కు తెలియదా? . తమను షర్మిల దూషించిన విషయం కూడా గవర్నర్ తెలియదా ? అని అడిగారు. సంస్కారహీనంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నా ఏం మాట్లాడొద్దా ?” అని బాల్క సుమన్ వ్యాఖ్యనించారు.