సీఎం కాన్వాయ్‌ నుంచి జారిపడ్డ మహిళా పోలీస్‌ అధికారి

A female police officer slipped from the CM’s convoy: తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని ఒక కారు నుంచి మహిళా పోలీసు అధికారి జారిపడ్డారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనకు వెళ్తుండగా.. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ బయలుదేరిన సమయంలో ఒక మహిళా అధికారి కాన్వాయ్‌లోని ఓ కారు నుంచి కిందకు జారిపడ్డారు. ఆమె పూర్తిగా కారులోకి ఎక్కకముందే డ్రైవర్ కారును మూవ్ చేయడంతో రోడ్డుపై పడిపోయారు. ఆమె పడిపోగానే వెనకనే వస్తున్న కార్లు స్లో అయ్యాయి. ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే పైకి లేచిన మహిళా పోలీసు అధికారి వెంటనే అదే కారులో ఎక్కేసి వెళ్లిపోయారు. దాంతో సీఎం కేసీఆర్ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like