గుండె డాక్టర్‌ను మింగేసిన గుండెపోటు

-16 వేల గుండె ఆప‌రేష‌న్లు చేసిన డాక్ట‌ర్‌
-తీవ్ర గుండెపోటుతో మృత్యువాత‌

ఆయ‌న వ‌య‌సు 41 ఏండ్లే.. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు 16 వేల గుండె ఆపరేషన్లు చేశారు. ఆయ‌న హ‌స్త‌వాసి మంచింద‌ని చుట్టుప‌క్క‌ల పేరుంది. ఆయ‌న‌తో ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు ఎంత స‌మ‌యం అయినా ప‌ర్లేదు పేషెంట్లు వేచి చూస్తారు. కానీ, అలాంటి డాక్ట‌ర్‌నే గుండెపోటుతో మింగేసింది.

అతని పేరు డాక్టర్ గౌరవ్ గాంధీ. గుజరాత్ రాష్ట్రం, జామ్ నగర్ నివాసి. గౌరవ్ గాంధీ కార్డియాలజిస్ట్ గా పేరు పొందారు. ఆయ‌నంటే జామ్ నగర్ మాత్ర‌మే కాదు చుట్టు ప‌క్క‌ల చాలా ఫేమ‌స్‌. మంగ‌ళ‌వారం రాత్రి ఆస్పత్రిలో పేషెంట్లను చూసి జామ్ నగర్ ప్యాలెస్ రోడ్డులోని తన ఇంటికి వచ్చారు. రోజు మాదిరిగానే భోజ‌నం చేసి రాత్రి 11 గంటల సమయంలో నిద్ర పోయారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు లేచి వాకింగ్ కు వెళ్లే గౌరవ్ ఈరోజు ఉదయం నిద్ర లేవలేదు. బయట వర్షం పడుతుండటంతో నిద్ర లేవలేదని భావించిన కుటుంబ సభ్యులు.. అతన్ని డిస్ట్రబ్ చేయలేదు. 7 గంటల తర్వాత కూడా నిద్ర లేవకపోవటంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు నిద్ర లేపారు. ఉలుకూ పలుకూ లేకపోవటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.

డాక్ట‌ర్‌ గౌరవ్ నిద్రలోనే తీవ్ర గుండెపోటు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్లు చెబుతున్నారు డాక్టర్లు. ఆయ‌న 41 ఏళ్ల వయస్సుకే 16 వేల గుండె ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. అలాంటి వైద్యులు ఇక లేర‌న్న విష‌యాన్ని జామ్ నగర్ వాసులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. దేశంలోనే అతి చిన్న వయస్సులోనే ప్రముఖ కార్డియాలజిస్ట్ గా పేరు పొందిన గౌరవ్ అదే గుండెపోటుతో చనిపోవటం షాక్ కు గురి చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like