పేకాట స్థావరంపై మెరుపు దాడి.. రూ. 13.11 ల‌క్షలు స్వాధీనం

పధ్నాలుగు మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు

పేకాట స్థావ‌రంపై మెరుపుదాడి చేసిన పోలీసులు రూ. 13.11 ల‌క్షలు స్వాధీనం చేసుకుని 14 మందిపై కేసు న‌మోదు చేశారు. శనివారం సాయంత్రం సిర్పూర్(టి) మండలం భీమన్న గుడి అట‌వీ ప్రాంతంలో పేకాట స్థావరంపై కౌటాల సీఐ సాధిక్ పాషా, దీకొండ రమేశ్ అధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో పధ్నాలుగు మందిని పట్టుకుని కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి పదమూడు లక్షల పదకొండు వేల రూపాయ‌ల‌ నగదు స్వాధీనం చేసుకున్న‌ట్లు కౌటాల సిఐ సాదిక్ పాషా, సిర్పూర్(టి) ఎస్ఐ ధీకొండ రమేష్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా కౌటాల సీఐ సాధిక్ పాషా మాట్లాడుతూ సిర్పూర్(టి) మండలంలో పేకాట, ఐపీఎల్ బెట్టింగ్, ఆన్లైన్ జూదం, మట్కాలాంటివి ఆడి జీవితాలు పాడుచేసుకోవద్దన్నారు. ఐపీఎల్ బెట్టింగ్లు చేస్తూ, ఆన్లైన్ మాట్కా, జూదం ఆడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆడినవారు దొరికితే కేసులు నమోదు చేస్తామని హెచ్చ‌రించారు. యువత ఇలాంటి ఆన్ లైన్ జూదం, క్రికెట్ బెట్టింగ్ లు ఆడుతూ అత్యాశకు పోయి జీవితాలు పాడుచేసుకోవద్దని, ఆర్థికంగా నష్టం పోతారని స్ప‌ష్టం చేశారు. కేసులు నమోదయితే ఉద్యోగ అవకాశాలు, ఇతర అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పేకాట, ఆన్లైన్ మట్కా, జూదం, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారి సమాచారం ఇవ్వాల‌ని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సీఐ సాధిక్ పాషా వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like