ఓపెన్ కాస్ట్ లో తప్పిన ప్రాణాపాయం

Singareni:సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. రామగుండం ఏరియా ఆర్జీ3 ఓపెన్కాస్ట్ 1 లో అధికారులు తీసుకువచ్చిన బొలెరో (కాంపర్) ను డంపర్ ఢీకొట్టింది. కుడివైపు ఉన్న కాంపర్ డంపర్ ఆపరేటర్ సదా శ్రీనివాస్ కి కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమయానికి అందులో ఎవరూ లేకపోవడం, కాంపర్ డ్రైవర్ సమ్మయ్య అప్రమత్తం కావటంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like