బెల్లంప‌ల్లి శివారులో పెద్ద‌పులి సంచారం

-అట‌వీ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చిన మేక‌ల కాప‌రి
-పాద‌ముద్ర‌ల‌ను ధ్రువీక‌ర‌ణించిన అధికారులు

A tiger roams in the suburbs of Bellampally: మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి శివారు ప‌రిధిలో పెద్ద‌పులి సంచ‌రిస్తున్న‌ట్లు అట‌వీ శాఖాధికారులు గుర్తించారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి, మందమర్రి మండలం ఆదిల్‌పేట అట‌వీ ప్రాంతంలో పులి సంచారం ఉన్న‌ట్లు గుర్తించారు. మొద‌ట‌గా పులిని గ‌మ‌నించిన ప‌శువుల కాప‌రి స‌మాచారాన్ని ఫారెస్టు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించారు. ఆ పాద‌ముద్ర‌లు పులివిగా గుర్తించిన అట‌వీశాఖ అధికారులు చుట్టుప‌క్క‌ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like