ఆ భేటీలో ఉదోగ్య నోటిఫికేషన్లు

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గం రెండురోజుల్లో సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రప్రభుత్వ వైఖరి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. ఈ నెల లోపు పంటలసాగుపై అవగాహన, ఉద్యోగాలభర్తీపై నోటిఫికేషన్ ఇవ్వాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈనెల 14న తెలంగాణ కేబినెట్ నిర్వహించనున్నారు. . ఉద్యోగలభర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్లకు కేబినెట్‌లో పచ్చజెండా ఊపనున్నారు. దాదాపు 70వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎప్పటిలోగా ఈ నియామకాలు పూర్తి చేయాలన్నదానిపై కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like