ఆ హెలికాప్ట‌ర్ ఎంతో అడ్వాన్డ్

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్ఎంతో అడ్వాన్డ్స్‌ చెందిన‌ద‌ని సైనికాధికారులు చెబుతున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌ ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న విమానం తమిళనాడులో కుప్పకూలిపోయింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న హెలికాప్టర్ ఎంఐ 17 వి5 చాలా చాలా అత్యాధునిక‌మైంది. ఈ మోడల్ హెలికాప్ట‌ర్ రష్యాలో తయారు చేసింది. మిగతా ఆర్మీ హెలికాప్టర్‌లతో పోలిస్తే చాలా అడ్వాంన్స్‌డ్. ఇండియాలోనే కాదు చాలావరకు దేశాల్లో ఆర్మీ ఈ హెలికాప్టర్లు ఉపయోగిస్తోంది. ఎంఐ-8/17 హెలికాప్టర్‌కు మరికాస్త అడ్వాన్స్‌డ్ వర్షన్‌లో తయారు చేసిందే 17వి5. రష్యాలోని కాజన్ హెలికాప్టర్స్ సంస్థ ఈ హెలికాప్టర్ల‌ను తయారు చేస్తోంది. ఈ హెలికాప్టర్‌లు అగ్ని ప్రమాదాలు,కాన్వాయ్,పెట్రోలింగ్ సమయంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 2008లో భారతదేశ డిఫెన్స్ అధికారులు 80 ఎంఐ 17 వి5 హెలికాప్టర్లు ఆర్డర్ చేశారు. 2011లో వీటిని తయారు చేయడం ప్రారంభించిన కాజన్ సంస్థ 2018లో హెలికాప్టర్‌లను భారతదేశానికి అందించింది. ఎంఐ 17 వి5 టీవీ 3-117 VM లేదా VK-2500 టర్బో ఇంజన్‌తో నడుస్తుంది. TV3-117VM ఇంజన్ ఉన్నహెలికాప్టర్ 2,100 హార్స్‌ పవర్‌తో నడుస్తుంది. VK-2500 ఇంజన్ ఉన్న విమానం 2,700 హార్స్‌ పవర్‌తో నడుస్తుంది. ఎంఐ 17వి5 హెలికాప్టర్‌లో డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ కూడా అమర్చబడి ఉంటుంది. ఇవి 250 వేగంతో 580 కిలోమీట‌ర్ల నుంచి 1,065 కిలోమీట‌ర్ల వరకు ప్రయాణించగలుగుతాయి. ఇందులో రెండు ఫ్యుయల్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ హెలికాప్టర్ ఒకేసారి 13.000 కిలోల బరువును మోయగలదు. ఏ వాతావరణంలో అయినా ప్రయాణం చేయగలదు. ఎంఐ 17 వి5 హెలికాప్టర్‌.. సైన్యానికి ఆయుధాలను తీసుకెళ్లడానికి కూడా ఉపయోగపడుతుంది. మెషిన్ గన్స్, మిసైల్స్, రాకెట్స్ లాంటివి ఇందులో ఒకేసారి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ మోడ‌ల్ హెలికాప్టర్ వల్ల ఇంతకు ముందు కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నా ఇతర కార్గో విమానాలతో పోలిస్తే ఇవి తక్కువే అని అధికారులు అంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like