ఆ నేత ఎవ‌రు..? ఇంట‌లిజెన్స్ ఆరా..

వివాహిత‌ను లోబ‌ర్చుకుని, సింగ‌రేణి కార్మికుడి కుటుంబాన్ని ఇబ్బందుల‌కు గురిచేస్తున్న ఆ టీబీజీకేఎస్ నేత ఎవ‌రు..? అనే విష‌యంలో ఇంటలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

మంద‌మ‌ర్రి ఏరియాకు చెందిన ఓ టీబీజీకేఎస్ నేత త‌న వ‌ద్ద‌కు ప‌నికోసం వ‌చ్చిన ఓ కార్మికుడి భార్య‌పై క‌న్నేసి, ఆమెను లోబ‌రుచుకున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై ”నాంది న్యూస్” క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ క‌థ‌నం సింగ‌రేణివ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఆ నేత ఎవ‌రు అనే విష‌యంలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. ఈ నేప‌థ్యంలోనే ఇంట‌లిజెన్స్ పోలీసులు సైతం దీనిపై దృష్టి సారించారు. ఆ టీబీజీకేఎస్ నేత ఎవ‌రు..? బాధితుడు ఎవ‌రు..? అనే విష‌యంపై వివ‌రాలు సేక‌రిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆ నేత‌కు స‌హ‌రిస్తున్న వ్య‌క్తులు, పోలీస్‌స్టేష‌న్ వెళ్ల‌కుండా ఆపుతున్న‌ది ఎవ‌రు అనేదానిపై కూడా ఆరా తీస్తున్నారు.

ఆందోళ‌న‌కు యూనియ‌న్ల నేత‌లు సిద్ధం..
తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘానికి చెందిన నేత రాస‌లీల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో దాని విష‌యంలో ఆందోళ‌న చేసేందుకు హెచ్ఎంఎస్‌, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ నేత‌లు సిద్ధం అవుతున్నారు. ఈ విష‌యంలో ఏఐటీయూసీ మాత్రం వెన‌క‌డుగు వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో కొంద‌రు నేత‌ల బాధిత యువ‌కున్ని పోలీస్‌స్టేష‌న్ వెళ్ల‌కుండా ఆపిన‌ట్లు ఇంటలిజెన్స్ పోలీసులు గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేసిన‌ట్లు ఉన్న‌తాధికారులు పంపిన‌ట్లు స‌మాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like