ఆదాయం కోల్పోయిన షిర్డీ సంస్థాన్ .. రూ. 300 కోట్ల నష్టం

కరోనా మహమ్మారి కార‌ణంగా శ్రీ షిర్డీ సాయి సంస్థానానికి ఆదాయం భారీగా తగ్గింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్‌లో షిర్డీ సాయిబాబా మందిరం ఎనిమిది నెలలు మూసివేయ‌గా, రెండవ దశలో ఆరు నెలలపాటు మూసేశారు. మొత్తం 14 నెలలపాటు ఆలయ ద్వారాలు మూసివేశారు. దీంతో శ్రీషిర్డీ సాయిబాబా సంస్థాన్ కు సుమారు రూ. 300 కోట్ల నష్టం వాటిల్లింది. కరోనా మహమ్మారికి ముందు శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు ప్రతి రోజు సుమారు 50 నుంచి 60 వేల భక్తులు షిర్డీకి వచ్చేవారు.

ఆ సమయంలో హుండీలో భక్తులు కానుకల రూపంలో బంగారం వెండి నగదుతోపాటు ఆన్ లైన్ లో కూడా కానుకలు సమర్పించేవారు. ఇలా ప్రతిరోజూ సగటున రూ. ఒక కోటి నుంచి రూ. 1.25 కోట్ల వరకు దేవాలయానికి కానుకలు లభించేవి. లాక్ డౌన్ కారణంగా భక్తులు లేక శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. అక్టోబర్ ఏడవ తేదీ నుంచి భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ప్రారంభంలో కేవలం 15 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించినా, ప్రస్తుతం 25 వేల మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. కానీ వయో పరిమితి నిబంధనతో అనేక మంది భక్తులు తమ వయోవృద్ధులైన తల్లిదండ్రులతోపాటు పదేళ్లలోపు పిల్లలతో సాయిని దర్శించుకునేందుకు వీలులేకుండాపోయింది.

దీంతో అనేక మంది ఇంకా షిర్డీకి రావడం లేదు. నెల రోజులుగా పరిశీలించినట్టయితే ప్రతి రోజు సగటున కేవలం రూ.35 నుంచి రూ.40 లక్షల కానుకలు మాత్రమే అందుతున్నాయి. భక్తుల నుంచి కానుకలు తగ్గడంతో షిర్డీసాయి సంస్థానంపై ఆర్థిక ప్రభావం పడుతోంది. ముఖ్యంగా సాయిసంస్థాన్లో కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పర్మినెంట్ కార్మికుల తో కలిపి మొత్తం సుమారు నాలుగు వేల మంది ఉన్నారు. సంస్థాన్ పరిధిలో రెండు ఆసుపత్రులుండగా వీటి లో ఒక ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తా రు. అదేవిధంగా సాయిబాబా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో స్వల్ప ధరలకే చికిత్స అందిస్తున్నా రు.

మరోవైపు సాయి ప్రసాదాల యంలో ఉచితం గా భోజనాలు దర్శనం కోసం క్యూలో ఉండే భక్తులకు ఉచితంగా బూందీ లడ్డు ప్రసాదం ఇస్తారు. అత్యల్ప ధరలకే సాయిభక్తి నివాసాల్లో ఉండేందు కు గదులు.. ఇలా అనేక సౌకర్యాలను షిర్డీ సాయి సంస్థాన్ కల్పిస్తోంది. జాతీయ విపత్తుల సమయంలో పెద్దఎత్తున షిర్డీ సాయి సంస్థా న్ ఆర్థికంగా ప్రభుత్వానికి సాయం చేస్తోంది. కొంతకాలంగా భక్తుల సంఖ్యతోపాటు ఆదాయం తగ్గి సుమారు రూ. 300 కోట్ల నష్టం వాటిల్లింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like