ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. మంచిర్యాల‌లో ఆసుప‌త్రుల‌పై వేటు

మంచిర్యాల : నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డ‌స్తున్న ఆసుప‌త్రుల‌పై వేటు వేస్తూ మంచిర్యాల జిల్లా అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు జిల్లాలో ఐదు బృందాలు జిల్లాలోని ప‌లు ఆసుప‌త్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంట‌ర్ల‌పై దాడులు నిర్వ‌హించారు. రెవెన్యూ, వైద్య, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు ఆసుపత్రులపై తనిఖీలు నిర్వ‌హించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 19 ఆసుపత్రులు, ల్యాబ్‌ల‌ను అనుమతులను రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. కొద్ది రోజుల కింద‌ట ఆసుప‌త్రుల్లో డాక్ట‌ర్లు ఫేక్ డిగ్రీల‌తో వైద్యం చేస్తున్నార‌ని క‌లెక్ట‌ర్ భార‌తి హోళీకేరీ, జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదులు అందాయి. దీంతో సీరియ‌స్ అయిన క‌లెక్ట‌ర్ ఈ త‌నిఖీల‌కు ఆదేశించారు. ఈ త‌నిఖీల్లో అనుమ‌తులు స‌రిగా లేని, నిబంధ‌న‌లు పాటించ‌ని ఆసుప‌త్రులు, ల్యాబ్‌ల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు.

అనుమ‌తులు ర‌ద్దు చేసిన ఆసుప‌త్రులు, ల్యాబ్‌లు

1. హెల్త్ కేర్ ల్యాబ్, లక్సెట్టిపేట్
2. లక్ష్మీగణపతి హాస్పిటల్, లక్సెట్టిపేట్
3. శ్రీ సాయి సాకేత్ హాస్పిటల్, లక్సెట్టిపేట్
4. శ్రీ సాయి సాకేత్ చిల్డ్రన్స్ హాస్పిటల్, లక్సెట్టిపేట్
5. అక్షర డెంటల్, లక్సెట్టిపేట్
6. డాక్టర్స్ ల్యాబ్,లక్సెట్టిపేట్
7.శ్రీ సాయి క్లినికల్ ల్యాబ్, లక్సెట్టిపేట్
8. SR డయాగ్నోస్టిక్స్, సీసీసీ శ్రీ‌ రాంపూర్
9. స్కోప్ డయాగ్నోస్టిక్లక్సెట్టిపేట్ చెన్నూర్
10. శ్రీ కృపా డెంటల్ హాస్పిటల్, నస్పూర్
11. MAA డయాగ్నోస్టిక్, చెన్నూర్
12. పరమేశ్వర డయాగ్నోస్టిక్, చెన్నూరు
13. శివ బాలాజీ డెంటల్, మంచిర్యాల‌
14. వెంకటేశ్వర డెంటల్ ఇంప్లాంట్ సెంటర్, మంచిర్యాల
15. ఫిజియోథెరపీ సెంటర్, మంచిర్యాల‌
16. సిరి డెంటల్ & ఐ, మంచిర్యాల‌
17. కేర్ డయాగ్నోస్టిక్, మంచిర్యాల
18. శ్రీ సాయి మారుతి ఐ హాస్పిటల్, మంచిర్యాల‌
19.కొత్త వెంకటేశ్వర‌ కంటి ఆసుపత్రి, మంచిర్యాల‌

Get real time updates directly on you device, subscribe now.

You might also like