అభివృద్ధి చూసి ఓర్వ‌లేక అభాండాలు

మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావు

మంచిర్యాల : గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి ప‌థంలో కొన‌సాగుతోంద‌ని మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న త‌న నివాసంంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఓటు వేసిన ప్రజానీకానికి జవాబుదారీగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నామ‌ని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి మెడికల్ క‌ళాశాల‌ తీసుకువచ్చామని,మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల వాంఛ గోదావరి నదిపై మంచిర్యాల గోలివాడ బ్రిడ్జి నిర్మాణానికి రూ.164 కోట్ల ప్ర‌భుత్వంతో మాట్లాడి అనుమ‌తి తీసుకువ‌చ్చామ‌ని వెల్ల‌డించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంద‌ల కోట్ల రూపాయలను కేటాయించి మంచిర్యాల‌ను సుందరంగా తీర్చిదిద్దుతా ఉంటే ప్రతిపక్షపార్టీలు ఓర్వలేక అభాండాలు వేస్తున్నరన్నారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ప్రమాదాల నివారణలో భాగంగా నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి పాత మంచిర్యాల నుండి ఓవర్ బ్రిడ్జి వరకు 10.68 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు విస్త‌ర‌ణ‌ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇక్క‌డ కొంతమందికి తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కనబడడం లేదని ఎద్దేవా చేశారు. ఏదో ఒక‌టి మాట్లాడి బుర‌ద‌చ‌ల్లే కార్య‌క్ర‌మం త‌ప్ప ఏం లేద‌న్నారు. వారి మాటలను జనం నమ్మకూడదని ఎమ్మెల్యే దివాక‌ర్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like