ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజే ఏసీబీ ట్రాప్‌

ACB: ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజే ఓ ఉద్యోగిని లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైంది. సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‭గా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే లంచం తీసుకుంటూ రెండ్ హ్యాండెడ్‌గా పడ్డుబడ్డారు ఒక మహిళా అధికారి. మిథాలీశ‌ర్మ అనే అధికారిణి 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ తన చాంబర్‭లోనే దొరికిపోయారు.

ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రం కోడెర్మా సర్కిల్ సహకార శాఖలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా మిథాలీశ‌ర్మ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆమె కోడెర్మ వ్యాపార్ మండలం విత్తన పంపిణీకి నోడల్ ఏజెన్సీ బోర్డ్ ఆఫ్ ట్రేడ్‌ తనిఖీ చేశారు. అందులో అవ‌క‌త‌క‌వ‌లు ఉన్నాయ‌ని త‌న‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నిర్వ‌హ‌ణ క‌మిటీ స‌భ్యుడు రామేశ్వర్ ప్రసాద్ యాదవ్ కు అల్టిమేట‌మ్ జారీ చేశారు. ఈ విష‌యంలో మిథాలీ శ‌ర్మ‌ను క‌లిసేందుకు రామేశ్వ‌ర్ ప్ర‌సాద్ వెళ్లారు. అయితే, ఆమె రూ. 20 వేలు లంచం అడిగారు. డ‌బ్బులు ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌ని రామేశ్వ‌ర్ ప్ర‌సాద్ హాజారీబాగ్ ఏసీబీ అధికారుల‌ను సంప్ర‌దించారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న ఏసీబీ అధికారులు మిథాలీ శ‌ర్మ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు.

ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజే లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ‌టం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కాగా, కేవ‌లం 11 రోజుల్లోనే ఏసీబీ ట్రాప్ ఇది రెండోది కావ‌డం గ‌మ‌నార్హం. జూన్ 27న, ఒక ఫారెస్ట్ గార్డును అవినీతి నిరోధక బ్యూరో హజారీబాగ్ బృందం లక్ష రూపాయల లంచం తీసుకున్నందుకు అరెస్టు చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like