బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Singareni:సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 గనిలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. గనిలోని మూడో సీమ్, 3 ఎస్పీ 2 డిస్ట్రిక్, 20వ లెవల్ వద్ద రూఫ్ ఫాల్ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో టింబర్మెన్లు బొద్దుల రవి, తిరుపతి రెడ్డి, బొడ్డు అశోక్ గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like