ఫిర్యాదుల‌పై వెంట‌నే స్పందించాలి

-ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలి
-పోలీస్ స్టేషన్లను త‌నిఖీ చేసిన ఏసీపీ ఎడ్ల మ‌హేష్‌

ACP Edla Mahesh inspected the police stations: పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చిన ఫిర్యాదుపై వెంట‌నే స్పందించాల‌ని బెల్లంప‌ల్లి ఏసీపీ ఎడ్ల మ‌హేష్ పోలీసు అధికారుల‌కు సూచించారు. ఆయ‌న బుధ‌వారం నెన్న‌ల‌, బెల్లంపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని కోరారు. గ్రామాలలో సీసీ కెమెరాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వ కంగా మాట్లాడాలన్నారు. విలేజ్‌ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామలకు వెళ్లి ప్రజలతో మమేకం కావాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల సమస్యలు తెలుసుకుంటూ పై అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని, వెంటనే పెండింగ్ కేసులను పూర్తి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల నివారణ గురించి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. దొంగతనాలు నిర్మూలన గురించి గ్రామాలలో, దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. నెన్న‌ల పోలీస్ స్టేషన్ లో సిబ్బంది వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన నూతన షెడ్ ఏసీపీ మ‌హేష్ ఈ సంద‌ర్భంగా ప్రారంభించారు.

5 S ఇంప్లిమెంటేషన్ లో భాగంగా నెన్న‌ల‌, బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లను ఆధునికరించి, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసిన సీఐ బాబు రావు, ఎస్ఐ రాజశేఖర్, ఆంజనేయుల్ని ఏసీపీ ఈ సంద‌ర్బంగా అభినందించారు. అనంతరం అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ బాబు రావు, నెన్న‌ల‌ ఎస్సై రాజ్ శేఖర్ ,బెల్లంపల్లి 2 ఎస్సై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like