ఏసీపీ సస్పెన్షన్

ఒక కేసులో .ముడుపులు తీసుకున్న వ్యవహారంలో ఏసీపీపై సస్పెన్షన్ వేటు పడింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం స్థిరాస్తి వ్యాపారుల జంట హత్యల కేసులో ఏసీపీపై ఆరోపణలున్నాయి. గతంలోనూ బాలకృష్ణ రెడ్డి సస్పెండ్ అయ్యారు. తాజాగా రియల్ ఎస్టేట్ వివాదంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో డీజీపీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఓ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సీపీ మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. తాజాగా ఏసీపీని సస్పెండ్ చేయడం సంచలనం గా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like