లాభాల వాటా ప్ర‌క‌టించ‌కుంటే ఆందోళ‌న‌

Action if profit share is not declared: సింగ‌రేణిలో లాభాల వాటా ప్ర‌క‌టించకుంటే ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్‌) నేత‌లు స్ప‌ష్టం చేశారు. శ్రీ‌రాంపూర్ ఏరియా RK 5 గనిపై సేఫ్టీ ఆఫీసర్ శివయ్యకి విన‌తిప‌త్రం అందించారు. SCMKS-BMS వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మాట్లాడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంస్థ వ్యాప్తంగా వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాల‌ని డిమాండ్ చేశారు. 35శాతం వాటాను జాప్యం లేకుండా కార్మికులకు పంపిణీ చేయాలని కోరారు. కొంతకాలంగా సింగరేణి కార్మికులందరూ ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నార‌ని వెల్ల‌డించారు. సింగ‌రేణి, రాష్ట్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు లాభాల వాటా విష‌యంలో దాట‌వేత వైఖ‌రి అవ‌లంబిస్తున్నార‌ని అది స‌రికాద‌న్నారు. దీంతో కార్మికులు అసహనానికి గురవుతున్నారని స్ప‌ష్టం చేశారు. సెప్టెంబర్ 25 లోపు చెల్లించాలని, లేక‌పోతే జ‌రిగే ప‌రిణామాల‌కు సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వదే పూర్తి బాధ్య‌త అన్నారు. కార్య‌క్ర‌మంలో శ్రీరాంపూర్ ఏరియా సెక్రెటరీ నాతాడి శ్రీధర్ రెడ్డి, పిట్‌ సెక్రటరీ జీడి ప్రభాకర్, పాగిడి శ్రీకాంత్, గోపతి సందీప్, రాజేందర్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like