తెలుగు స‌త్య‌భామ ఇక లేరు…

సినీన‌టి జ‌మున క‌న్నుమూత

Jamuna : టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి జమున (86) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని నివాసంలో ఆమె కన్నుమూశారు. జమున 1936 ఆగస్ట్‌ 30న హంపీలో జన్మించారు. ఆమె తొలిచిత్రం పుట్టిల్లు. రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది. ఎన్నిపాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్ర సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున.

దాదాపు 198 సినిమాల్లో జమున. దక్షిణాది భాషలన్నంటితో పాటు.. పలు హిందీ సినిమాల్లోనూ నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె.

1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నారు. తిరిగి, 1990వదశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. 11 గంటలకు జమున భౌతికకాయాన్ని ఫిల్మ్‌చాంబర్‌కు తరలిస్తారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like