పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పిన అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్‌

Additional Collector who taught children: కొమురం భీమ్ ఆసిఫాబాద్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ చాహ‌త్ వాజ్‌పాయ్ టీచ‌ర్‌గా మారి పిల్ల‌ల‌కు పాఠాలు బోధించారు. పిల్ల‌ల‌తో ముచ్చటించి వారిని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగి తెలుసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. చింత‌ల మానేప‌ల్లి మండ‌లం డ‌బ్బా గ్రామానికి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ డబ్బా గ్రామంలో జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఆమె కాసేపు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయురాలిగా మారారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఉపాద్యాయులు బోధించిన పాఠాలలో కొన్ని ప్రశ్నలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like