అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే కార్మికుడి మృతి

వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి - కార్మికుడు చనిపోతే సింగరేణి సంబురాలు సిగ్గుచేటు - బీఎంఎస్ అధ్య‌క్షుడు యాద‌రిగి స‌త్త‌య్య

గోదావ‌రిఖ‌ని – ఆర్జీ 3 ఏరియాలోని ఓసీపీ 1లో జ‌రిగిన ప్ర‌మాదం అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే జ‌రిగింద‌ని, వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఎంఎస్ అధ్య‌క్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. రక్షణ అధికారుల నిర్లక్ష్యం వ‌ల్ల‌నే ఈ డంపర్ ప్రమాదం జ‌రిగింద‌న్నారు. రక్షణ చర్యలు పటిష్టం చేయ‌డంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంద‌న్నారు. గత నెల 29వ తారీఖున రామగుండం రీజియన్ లో నిర్వ‌హించిన సేఫ్టీ ట్రై పార్టేడ్ సమావేశంలో సింగరేణి వ్యాప్తంగా ప్రమాదాలు జరగకుండా అనేక సూచనలు సలహాలు డైరెక్షన్స్ ఇచ్చినా వాటిని ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గని ప్రమాదాలను నివారించడానికి వైఫల్యం చెందిన సింగరేణి యాజమాన్యం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొగ్గు ఉత్పత్తి ప్రధాన ధ్యేయంగా కార్మికుల ప్రాణాలను గాలికి వదిలేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంబంధిత అధికారుల వైఖరి మార్చుకోవాల‌న్నారు. డీజేఎంఎస్ ద్వారా సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయం గని ప్రమాదంలో కార్మికుడు చనిపోతే సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సిగ్గుచేట్ట‌న్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుని కుటుంబానికి ఒక కోటి రూపాయల ప్రత్యేక ఎక్స్ గ్రేషియా చెల్లించాలి డిమాండ్ చేశారు. అధికమైన పొగ మంచు ఉన్నా, కండిషన్ లేని డంపర్స్ బొగ్గు మట్టిని రవాణా చేసేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నా బ‌ల‌వంతంగా నడిపించ మని చెప్పిన అధికారుల‌పై చర్యలు తీసుకోవాలన్నారు. బీఎంఎస్ నాయకులు సాయివేణి స‌తీష్‌, నాయకులు వై సారంగపాణి గాజుల వెంకటస్వామి, జనగామ రాయలింగు, గుండెబోయిన భూమయ్య, పల్లె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

\

Get real time updates directly on you device, subscribe now.

You might also like