అది కేసీఆర్ పుణ్య‌మే

- రాష్ట్రంలో 6.70 ల‌క్ష‌ల‌ మంది యువత మద్యానికి బానిస‌య్యారు
- ఆడ‌పిల్ల‌ల పుస్తెలు తెంపుతున్నారు
- ఎంత‌మంది పీకేలు వ‌చ్చినా టిఆర్ఎస్ కాపాడలేరు
-కేసీఆర్ డ‌బ్బులు,మ‌ద్యం, పోలీసుల‌ను న‌మ్ముకున్నాడు
- ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా కేసీఆర్ ఓట‌మి ఖాయం
- హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్‌

మంచిర్యాల : తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల 70 వేల మంది యువత మద్యానికి బానిసై కుటుంబాలను నాశనం చేసుకున్నారని అది కేసీఆర్ పుణ్య‌మేన‌ని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటెల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ చంద్ర మౌల్లేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా కేసీఆర్ ఓట‌మి ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఏడాదికి 30వేల కోట్లు మద్యం ఆదాయం, అవే డబ్బులతో పథకాలు నడుస్తున్నాయని వివ‌రించారు. రాష్ట్రాన్ని తాగుబోతుల అడ్డ‌గా మార్చి ఆడబిడ్డల పుస్తెలు తెంపుతున్నావ‌ని కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. మద్యం అమ్మకాలు తగ్గిన జిల్లాల కలెక్టర్లకు సీఎస్ నేరుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

అణ‌చివేత‌, ఆక‌లితో ఉన్న జ‌నం వైపు ఉంటా..
ఈటెల రాజేందర్ గెలిస్తే 12వేల గ్రామాల్లో సంబురాలు ఎందుకు జరిగాయి కేసీఆర్ ఆలోచించాలన్నారు. ఒకప్పుడు కేసీఆర్ ను విమర్శిస్తే తెలంగాణ చీల్చి చెండాడేది అని చెప్పారు. నేడు కేసీఆర్ ని తిడితే చప్పట్లు కొడుతున్నారని చెప్పారు. కేసీఆర్ మాటలకి ఒకప్పుడు చప్పట్లు కొడితే.. ఇప్పుడు ఛీ కొడుతున్నారని వెల్ల‌డించారు. తాను అణచివేత, ఆకలితో ఉన్న జనం పక్షాన ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. తాను కేవ‌లంహుజురాబాద్ కే పరిమితమయ్యే వ్యక్తిని కాదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే కార్మికుల కోసం కొట్లాడిన అని స్ప‌ష్టం చేశారు. నశం లెక్క బిజెపిని పీల్చడం నీతరం కాదు కేసీఆర్ అని వెల్ల‌డించారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా బిజెపి బెదరద‌న్నారు. దేశంలో స్థిరంగా పాలిస్తున్న పార్టీ బిజెపి, అత్యధిక సభ్యత్వం ఉన్న ఒకేఒక పార్టీ బిజెపినే అన్నారు. ఇక నుండి ఏ జిల్లా అయిన కమలం జిల్లానే అని స్పష్టం చేశారు.

డ‌బ్బులు,మ‌ద్యం, పోలీసుల‌ను న‌మ్ముకున్నాడు
కేసీఆర్ డబ్బులు, మద్యం, కుట్రలు, పోలీసులను నమ్ముకున్నారని దుయ్య‌బ‌ట్టారు. టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే ఎంపీలు కేసీఆర్ బొమ్మతో వెళ్తే ఓడిపోవడం ఖాయమ‌న్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్షల ఎకరాల భూములు మాయం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ధరణి గ్రామాల్లోని ప్రజల కుటుంబాల్లో మట్టి పోసిందన్నారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి కర్రుకాల్చి వాత పెడుతారని స్ప‌ష్టం చేశారు. అడవిని నమ్ముకొని జీవిస్తున్న అమాయక బిడ్డల కడుపు కొట్టొద్ద‌ని హిత‌వు ప‌లికారు. తెలుగుదేశం పార్టీ తరహాలోనే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కూడా కేసీఆర్ మింగేస్తాడు

అందుకే ఇక్క‌డికి వ‌చ్చినా..
నా గెలుపు కోసం, ధర్మం ఒడిపోకూడదు అని తెలంగాణ వ్యాప్తంగా అనేకమంది అనేక మొక్కులు మొక్కుకున్నారు. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానన్నారు.. చాలామంది శబరిమలై వరకు పాదయాత్ర చేశారు. ఇల్లందకుంట రామాలయం నుండి తిరుమల కొండ వరకు పాదయాత్ర చేశారు. ఇక్కడ లక్ష్మణ పంతులు నెల రోజుల పాటు నా గెలుపుకోసం దీక్ష చేశారు. ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాల‌ని వెల్ల‌డించారు.

మీ ఇంట‌లిజెన్స్ స‌రిగ్గా స‌మాచారం ఇవ్వ‌డం లేదు…
ప్రజాక్షేత్రంలో మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు మీ ఇంటెలిజెన్స్ సరిగా సమాచారం అందించడం లేదు అనుకుంటా అని ప‌రోక్షంగా కేసీఆర్‌ను హెచ్చరించారు. అప్పట్లో రాజులు సైతం మారువేశాల్లో ప్రజల్లోకి వెళ్ళి ఎం జరుగుతుందో తెలుసుకొనే వారూ కానీ ఈ రాజు మాత్రం ప్రజలని కలవడని అన్నారు. అదిలాబాద్ అడవి బిడ్డలకు హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఏం జరుగుతుందో తెలియదు అని అనుకుంటున్నారేమో వీరు కూడా అక్కడ ఏం జరుగుతుంది అని నిత్యం గమనిస్తున్నారని హెచ్చ‌రించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like